ఈజిప్టు రాజధాని కైరోలో బాంబు పేలుడు

- December 04, 2015 , by Maagulf
ఈజిప్టు రాజధాని కైరోలో బాంబు పేలుడు

ఈజిప్టు రాజధాని కైరోలో బాంబు పేలిన ఘటనలో 16 మంది మృతిచెందారు. నగరంలోని అగౌజా ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్‌లోకి ఆగంతకులు బాంబును విసిరారు. మాస్కులతో వచ్చిన ముగ్గురు వ్యక్తులు రెస్టారెంట్‌లోకి బాంబును విసిరి పారిపోయారు. ఓ నైట్ క్లబ్‌ను ఆగంతకులు టార్గెట్ చేసిన పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దాడికి దిగింది ఎవరన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు. ఇటీవల ఈజిప్టులో మిలిటెంట్ల అరాచకాలు ఎక్కువవుతున్నాయి. దాంతో వాళ్ల పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com