సాహోలో మరో బాలీవుడ్ బ్యూటీ!
- April 20, 2018బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. సాహూ చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రం రూపొందుతుండడం విశేషం. కళ్ళు చెదిరే యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాహుబలి తరువాత ప్రభాస్ సినిమాపై అభిమానులలో ఉండే అంచనాలు దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
ఈ చిత్రం బాలీవడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మందిరా బేడీ, నీల్ నితిన్ ముఖేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా వద్ద సాగె భారీ యాక్షన్ సన్నివేశాలు అభిమానులని కట్టిపడేస్తాయని వినికిడి.
కాగా ఈ చిత్రంలో మరో అందాల తార కూడా జాయిన్ అయింది. బాలీవుడ్ భామ ఎలివిన్ శర్మ ఈ చిత్రంలో నటిస్తునట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. తాను యాక్షన్ సన్నివేశాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాని ఎలివిన్ శర్మ తెలిపింది. తనకు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ప్రభాస్, సుజిత్ కు కృతజ్ఞతలు తెలియజేసింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు