సిరియన్‌ శరణార్థులకు ఆహారసరఫరా కార్యక్రమం...విజయవంతంగా పూర్తి చేసిన చైనా

- April 20, 2018 , by Maagulf
సిరియన్‌ శరణార్థులకు ఆహారసరఫరా కార్యక్రమం...విజయవంతంగా పూర్తి చేసిన చైనా

బీరూట్‌: ప్రపంచ ఆహార కార్యక్రమం(డబ్ల్యుఎఫ్‌పి)లో భాగంగా సిరియన్‌ శరణార్థులకు ఆహార పదార్ధాలను సరఫరా చేసే కార్యక్రమాన్ని చైనా విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మేరకు లెబనాన్‌లోని చైనా రాయబారి వాంగ్‌ కెజియాన్‌ గురువారం ఒక ప్రకటనపై సంతకం చేశారు. డబ్ల్యుఎఫ్‌పి లెబనాన్‌ విభాగం డైరెక్టర్‌ డొమినిక్‌ హెన్‌రిచ్‌ సమక్షంలో సంతకాలు జరిగిన ఈ ప్రకటనను ఆయన మీడియాకు విడుదల చేశారు. 2016లో డబ్ల్యుఎఫ్‌ఓతో కుదుర్చుకున్నఒప్పందం మేరకు అంతర్జాతీయ సంస్థలు, ఇతర దేశాలకు దాదాపు 10 కోట్ల డాలర్ల విలువైన మానవతా పరమైన సహాయం అందించేందుకు సిద్ధపడింది. ఇందులో 20 లక్షల డాలర్లను లెబనాన్‌, జోర్డాన్‌లలో వున్న సిరియన్‌ శరణార్థులకు ఆహార సరఫరాల కోసం నిర్దేశించింది. ఈ 20 లక్షల డాలర్ల సహాయంలో దాదాపు 5 లక్షల డాలర్ల సహాయాన్ని లెబనాన్‌లో వున్న 16 వేల మంది శరణార్థులకు అందచేశారు. గురువారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో ఈ మేరకు ప్రకటనను విడుదల చేసిన వాంగ్‌ ఈ కార్యక్రమంలో చైనా-డబ్ల్యుఎఫ్‌పి మధ్య కొనసాగిన సహకారాన్ని ప్రశంసించారు. లెబనాన్‌, పొరుగుదేశాలలోవున్న శరణార్థులకు భవిష్యత్‌లో కూడా సాయం అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు. ఈ శరణార్థి సమస్యకు తెరదించేందుకు వీలుగా సిరియా సంక్షోభానికి త్వరలోనే ఒక రాజకీయ పరిష్కరం కుదరగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు చైనా అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలియచేసిన హెన్రిచ్‌ సిరియా సంక్షోభానికి రాజకీయ పరిష్కారం కనుగొని శరణార్థుల సమస్యకు తెరపడే వరకూ చైనా తనసహాయాన్ని కొనసాగిస్తుందన్నఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com