మనామా:పేలుడు కేసులో ముగ్గురికి జీవిత ఖైదు
- April 20, 2018
మనామా:హై క్రిమినల్ కోర్టు ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. బుడైయా హైవేపై ఓ పేలుడుకి సంబంధించిన కేసులో ఈ ముగ్గురూ దోషులుగా తేలారు. టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ చీఫ్ అటార్నీ జనరల్ అహ్మద్ అల్ హమ్మాది మాట్లాడుతూ, న్యాయస్థానం వారిని దోషులుగా తేల్చిందని చెప్పారు. హత్యకు యత్నించడం, పేలుడు పదార్థాల్ని వినియోగించేందుకు శిక్షణ పొందడం, పేలుడు పదార్థాల్ని తయారు చేయడం, ఉపయోగించడం, విధ్వంసాలకు పాల్పడటం వంటి అభియోగాలు వీరిపై నిరూపించబడ్డాయి. నిందితుల్లో ఇద్దరి పౌరసత్వాన్ని కూడా న్యాయస్థానం రద్దు చేసింది. నిందితులు విచారణలో తమ నేరాన్ని అంగీకరించారు. అల్ కాదమ్ ట్రాఫిక్ లైట్ వద్ద బాంబుని వుంచి, పేల్చారు నిందితులు. అబు సైబా వద్ద బుడైయా హైవేపై ఈ పేలుడు చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







