షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న కేసీఆర్

షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్... కుటుంబ సమేతంగా షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో  ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌కు పాలకమండలి సభ్యులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. బాబాకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాబాను దర్శించుకోవడం ఆనందంగా ఉందని కేసీఆర్‌ అన్నారు.

 

Back to Top