అనీల్ కపూర్, మాధురీ దీక్షిత్ మొదటి లుక్ విడుదల
- April 21, 2018అనీల్ కపూర్, మాధురీ దీక్షిత్ .. ఈ కాంబినేషన్ ని 80,90లలో రొమాంటిక్ పెయిర్ గా చెప్పుకునే వారు. వీరి కాంబినేషన్ లో సినిమా అంటే అదీ పక్కా హిట్ అనే మూడ్ లో ఉండేవారు అప్పటి ఆడియన్స్. చివరిగా 2000 సంవత్సరంలో రూపొందిన రాజ్ కుమార్ సంతీషి డ్రామా మూవీ పుకర్ సినిమాలో కలిసి పని చేశారు అనీల్ కపూర్, మాధురీ దీక్షిత్. ఇప్పుడు 17 సంవత్సరాల మళ్ళీ ఈ కాంబినేషన్ ని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఇంద్ర కుమార్ . ఈ డైరెక్టర్ ఆ జంటతో కలిసి బేటా అనే సినిమా తెరకెక్కించగా ఇది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మరో సారి క్రేజీ కాంబోతో టోటల్ డమాల్ అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడు ఇంద్రకుమార్. తాజాగా అనీల్ కపూర్, మాధురీ దీక్షిత్‌ల ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. చిత్రానికి సంబంధించిన పిక్ అనే టాక్ వినిపిస్తుండగా, ఇందులో మాధురీ దీక్షిత్ భుజంపై రెండు చేతులు వేసి డిఫరెంట్ స్టిల్ ఇచ్చాడు అనీల్ కపూర్. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది. కామెడీ యాంగిల్ లో ఈ మూవీని దర్శకుడు తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. అభిమనుల మనసులలో చిరస్థాయిగా నిలిచేలా తమ చిత్రం ఉంటుందని ఇంద్ర కుమార్ అంటున్నారు.
తాజా వార్తలు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!