లండన్ వెళ్లిపోయిన నవాజ్ షరీఫ్?
- April 21, 2018
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ దొంగచాటుగా లండన్ పారిపోయినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే, ఆయన అనుచరులు మాత్రం లండన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భార్యను చూసేందుకే ఆయన లండన్ వెళ్లారని చెపుతున్నారు.
అక్రమ రహదారి నిర్మాణానికి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఎన్‌ఏబీ షరీఫ్‌కు సమన్లు జారీచేసింది. అవినీతి ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు ప్రధాని షరీఫ్‌పై అనర్హత వేటువేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రధాని పీఠాన్ని త్యజించారు.
ఈ పరిస్థితుల్లో నవాజ్ షరీఫ్ తన కుమార్తెతో కలిసి లండన్ వెళ్లారు. క్యాన్సర్ బారిన పడి లండన్ దవాఖానలో చికిత్స పొందుతున్న తన భార్య బాగోగులు చూసుకోవడానికి వెళ్లినట్టు సమాచారం. ఆయన తిరుగు ప్రయాణంపై ఎలాంటి సమాచారం లేదు.
మరోవైపు, ఈ నెల 21వ తేదీన లాహోర్‌లోని నేషనల్ ఎకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఏబీ) సంయుక్త దర్యాప్తు బృందం ఎదుట ఆయన హాజరుకావాల్సి ఉంది. అలాగే, 23వ తేదీన అవినీతి కేసులో కూడా ఏప్రిల్ 23వ తేదీన ఆయన కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉన్నది. దాని నుంచి తప్పించుకొనేందుకు దేశాన్ని వీడారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే, ఆయన తిరిగి ఇస్లామాబాద్‌కు వచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







