నన్ను రమ్మన్నప్పుడు చాలా బాధపడ్డా..గీత మాధురి
- April 21, 2018
సింగర్ గా తనకంటు ఒక గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్న సింగర్ గీతామాధురి. మొదట్లో తెలుగు సినీపరిశ్రమలో నాకు ఇచ్చిన ప్రాధాన్యతను చూసి సంతోషపడ్డా. ఆ తరువాత చాలా ఇబ్బందులకు గురయ్యా. అదే అవకాశాలు కావాలంటే దర్శకులు, నిర్మాతలు రమ్మని పిలవడం. సింగర్ కూడా ఇలాంటివి ఉంటాయని అనుకోలేదు. మొదట్లో సినిమాల్లో పాటలు పాడకముందు నా స్నేహితులు ఇదంతా జరుగుతుందని చెప్పారు. కానీ నేను నమ్మలేదు. కొంతమంది దర్శకులు, నిర్మాతలు నన్ను రమ్మన్నప్పుడు చాలా బాధపడ్డా. నా టాలెంట్‌కు ఇప్పటితో పుల్‌స్టాప్ పడిపోతుందని అనుకున్నా. కానీ నన్ను అలా పిలిచిన దర్శకుల దగ్గరకు అస్సలు వెళ్ళలేదు. వారి గురించి ఆలోచించడం తగ్గించాం. మంచి వ్యక్తులు అవకాశాలు ఇస్తే సినిమాల్లో పాటలు పాడాలని నిర్ణయించుకున్నా. అనుకున్న విధంగానే నాకు మరికొంతమంది అండగా నిలిచారు.. అవకాశాలిచ్చారు. ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో నేను గాయనిగా మంచి గుర్తింపును సంపాదించుకుంటూ వెళుతున్నందుకు ఎంతో సంతోషపడుతున్నానంటోంది గాయని గీతామాధురి.
తాజా వార్తలు
- దోపిడీ, మనీలాండరింగ్ కేసులో 80 మంది ముఠాకు జైలు శిక్ష..!!
- వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!
- రమదాన్..ఎనిమిదవ మక్కా లాంతర్ల ఉత్సవం ప్రారంభం..!!
- యూఏఈ ఎతిహాద్-శాట్ ప్రయోగం విజయవంతం..!!
- మాదకద్రవ్యాల వినియోగం..మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- అమెరికాలో గ్రీన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్..
- హెచ్ఐవీకి చెక్ పెట్టేలా కొత్త మందు..
- షఖురాలో హత్య.. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించిన బాధిత ఫ్యామిలీ..!!
- 2025-26 అకాడమిక్ ఇయర్.. విద్యార్థుల నమోదుకు సర్క్యులర్ జారీ..!!