ఎయిరిండియాలో ప్రమాదం..ముగ్గురికి గాయాలు

- April 21, 2018 , by Maagulf
ఎయిరిండియాలో ప్రమాదం..ముగ్గురికి గాయాలు

న్యూఢిల్లీ : అమృత్సర్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ విమానంలో విండో ప్యానెల్‌ విరిగి ప్రయాణికులపై పడడంతో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. దాదాపు 15 నిమిషాల పాటు విమానంలోని ప్రయాణికులు భయోత్పాతానికి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం బయలుదేరాక ఒక ప్రయాణికుడు సీటు బెల్టు ధరించకపోవడంతో బంప్‌ వద్ద ముందున్న కేబిన్‌ను బలంగా గుద్దుకున్నాడు. దీంతో విండో ప్యానెల్‌ విరిగి అతడిపై పడింది. ఈ ఘటనలో అతడితోపాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయిఓవర్‌ హెడ్‌ ప్యానెల్‌ పగలడంతో ఆక్సిజన్‌ మాస్కులు కిందపడ్డాయి. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారని ఎయిరిండియా సీనియర్‌ అధికారి తెలిపారు. అయితే బయటి విండో పగలకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు. విమానం ఢిల్లీలో ల్యాండైన వెంటనే గాయపడిన ముగ్గురు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించామని, ఓవర్‌ హెడ్‌ ప్యానెల్‌కు తల బలంగా తగలడంతో ప్రయాణికుడికి కుట్లు పడ్డాయని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న డిజిసిఎ ఈ విషయాన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బోర్డుకు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com