సౌదీ అధికారిక భవనం వద్ద పేలుడు
- April 21, 2018
ఇస్తాంబుల్ : సౌదీ అరేబియా అధికార నివాసం వద్ద శనివారం సాయంత్రం పేలుడు జరిగిందని సోషల్‌మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై వివరణనిచ్చిన అధికారులు వారి అనుమతి లేకుండా అధికారిక నివాసం వద్ద డ్రోన్‌ను ప్రయోగిస్తున్నారని భద్రతా దళాలు కాల్పులు జరిపినట్లు తెలిపారు. భద్రతా దళాలు రియాద్‌కు సమీపంలో సౌదీరాజు సల్మాన్ అధికారిక భవనమైన అల్- ఖజోమా వద్ద ఒక డ్రోన్‌ను గుర్తించినట్లు పేర్కొన్నారు. దీంతో భద్రతా దళాలు దానిని పేల్చివేశాయని తెలిపారు. అయితే ఇది రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే ఒక బొమ్మ విమానం అని తెలియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే యెమెన్ నుండి తరచుగా వచ్చే దాడుల నేపథ్యంలో సౌదీ భద్రతా దళాలు గట్టి భద్రతలు చేపట్టాయని పేర్కొన్నారు. ఈ పేలుడు జరిగిన సమయంలో సౌదీరాజు సల్మాన్ అధికారిక భవనంలో లేరని సౌదీ అధికారిక ప్రతినిధులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్‌తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









