ఈశ్వరరెడ్డి దర్శకత్వం లో 'అల్లరి' నరేశ్ హీరోగా ..

- December 04, 2015 , by Maagulf
ఈశ్వరరెడ్డి దర్శకత్వం లో 'అల్లరి' నరేశ్ హీరోగా ..

గతంలో 'గజదొంగ', 'అడవిదొంగ', 'దొంగరాముడు', 'చిన్నఅల్లుడు' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గోపీ ఆర్ట్స్‌ సంస్థ చాలా కాలం గ్యాప్‌ తర్వాత మళ్లీ చిత్రనిర్మాణకార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. యువకథానాయకుడు 'అల్లరి' నరేశ్ హీరోగా ఓ వినోదభరిత చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్‌లో మొదలయ్యాయని చిత్రనిర్మాత, గోపీ ఆర్ట్స్‌ అధినేత చలసాని రామబ్రహ్మంచౌదరి చెప్పారు. ఇంతకుముందు 'సిద్ధు ఫ్రం శ్రీకాకుళం' చిత్రానికి దర్శకత్వం వహించిన ఈశ్వరరెడ్డి ఈ సినిమాకి దర్శకుడు. ఏ.కె.ఎంటర్‌టైనమెంట్స్‌ అధినేత అనిల్‌ సుంకర ఈ చిత్రానికి సమర్పకుడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com