మేడే సెలబ్రేషన్స్ నిర్వహించనున్న బహ్రెయిన్ కేరళీయ సమాజం
- April 23, 2018
మనామా:బహ్రెయిన్ కేరళీయ సమాజం, మేడే సెలబ్రేషన్స్‌ని మే 1వ తేదీన నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో కల్చరల్, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్‌ని నిర్వహిస్తారు. కింగ్‌డమ్‌లోని పలు లేబర్ క్యాంప్స్ నుంచి సుమారు 2000 మంది వరకు కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ జమీల్ హుమైదాన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇండియన్ మూవీ సాంగ్స్, మలయాళం ఫోక్ సాంగ్స్, మిమిక్రీ, మోనోయాక్ట్, కబడ్డీ, టగ్ ఆఫ్ వార్, ఆర్మ్ రెజ్లింగ్ పోటీలు కూడా నిర్వహిస్తామని బికెఎస్ యాక్టింగ్ ప్రెసిడెంట్ మోహన్ రాజ్ పి.ఎన్ అలాగే జనరల్ సెక్రెటరీ ఎంపి రఘు చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ వేడుకలు జరుగుతాయి. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ప్రతినిథి డాక్టర్ మొహమ్మద్ అలి అల్ అన్సారీ, ఇండియన్ ఎంబసీ ప్రతినిథులు, తదితరులు వాలెడిక్టరీ ఫంక్షన్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంప్లాయీ ఫ్రెండ్లీ ఎంప్లాయర్స్‌ని ఈ కార్యక్రమంలో సత్కరిస్తారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్‌ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం









