45,000 ఎలక్ట్రానిక్‌ వీసాలను జారీ చేసిన మస్కట్‌ ఎయిర్‌పోర్ట్‌

- April 24, 2018 , by Maagulf
45,000 ఎలక్ట్రానిక్‌ వీసాలను జారీ చేసిన మస్కట్‌ ఎయిర్‌పోర్ట్‌

మస్కట్‌: మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 16 వరకు మొత్తం 45,000 ఎలక్ట్రానిక్‌ వీసలను జారీ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం వెల్లడించింది. దుబాయ్‌లోని అరేబియన్‌ ట్రావెల్‌ మార్కెట్‌ (ఎటిఎం)లో ఈ విషయాన్ని వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం, ఏటీఎంలో పాలుపంచుకుంటోంది. ఏప్రిల్‌ 22న దుబాయ్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో ఏటీఎం ప్రారంభమయ్యింది. మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం అండర్‌ సెక్రెటరీ మైతా సైఫ్‌ అల్‌ మహ్రౌకి నాయకత్వంలో ఓ డెలిగేషన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొంది. మైతా మాట్లాడుతూ, సుల్తానేట్‌లో టూరిజం డెవలప్‌మెంట్‌ కోసం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయనీ, మస్కట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ కొత్త టెర్మినల్‌ ప్రారంభం కూడా అందులో బాగమేనని చెప్పారు. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 16 వరకు 45,947 ఎలక్ట్రానిక్‌ వీసాలను మంజూరు చేశామని చెప్పారాయన. ఒమన్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ రెండో ఫేజ్‌ ప్రాజెక్ట్‌ శరవేగంగా పూర్తవుతోందని అన్నారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com