మస్కట్:వీసా ఎగ్రిమెంట్‌తో ఒమన్‌లోకి ఉచిత ప్రవేశం
- April 24, 2018మస్కట్: 33 దేశాల నుంచి ఒమన్‌కి వచ్చేవారికి వీసా లేకుండానే ఉచితంగా ఒమన్‌లోకి ప్రవేశం లభిస్తుంది. ఈ మేరకు ఒమన్, ఖతార్ మధ్య కుదిరిన ఒప్పందం సహకరిస్తుంది. రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒమన్ - ఖతార్ దేశాల మధ్య ఒప్పందం కుదిరిందనీ, ఈ ఒప్పందంలో భాగంగా జాయింట్ టూరిస్ట్ వీసాల ద్వారా ఇది సాధ్యపడుతుందని తెలిపారు. ఖతార్‌లో వీసా పొందే టూరిస్టులు ఒమన్‌లోకి ఎలాంటి ఫీజులు చెల్లించకుండానే ప్రవేశించొచ్చు. ఒమన్ నుంచి వీసా పొందే టూరిస్టులకూ ఇదే నియమం వర్తిస్తుంది. ఒమన్‌లో జాయిట్ వీసా కోసం 20 ఒమన్ రియాల్స్ చెల్లించాల్సి వుంటుంది. ఖతార్‌లో అయితే ఇది 100 ఖతారీ రియాల్స్ వుంటుంది. జాయింట్ వీసా నెలరోజులపాటు చెల్లుబాటవుతుంది. మొత్తం 33 దేశాలకు చెందినవారికి ఈ జాయింట్ వీసా సౌకర్యం కల్పిస్తున్నారు. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఐర్లాండ్, ఐస్లాండ్, ఇటలీ, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, బెల్జియం, పోర్చుగల్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, మలేసియా, హాంగ్ కాంగ్, న్యూజిలాండ్ తదితర దేశాలు ఈ లిస్ట్‌లో వున్నాయి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు