వలసదారుడ్ని ఎయిర్ లిఫ్ట్ చేసి, ఆసుపత్రికి తరలింపు
- April 24, 2018
మస్కట్: వలసదారుడొకర్ని ఎయిర్ లిఫ్ట్ ద్వారా ఖౌలా హాస్పిటల్‌కి ఒమన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్ తరలించింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, సుల్తాన్ కబూస్ పోర్ట్ - ముట్రాహ్‌లో ఓ క్రూయిజ్ షిప్‌లో వలసదారుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం అందిన వెంటనే, అతని ఎయిర్ లిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. క్రూయిజ్ షిప్‌లో వున్న అమెరికా జాతీయుడ్ని మెడికల్ ఎవాక్యుయేషన్ చేశారమని అధికారులు వివరించారు. వైద్య చికిత్స నిమిత్తం ఆయన్ని ఖౌలా హాస్పిటల్‌కి తరలించామని వారు చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌కి సంబంధించిన పలు సర్వీసుల్లో మెడికల్ ఎవాక్యుయేషన్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలోనే రాయల్ ఒమన్ ఎయిర్ ఫోర్స్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది.
తాజా వార్తలు
- జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్ గా అలోక్ జోషి
- హజ్ వ్యాక్సినేషన్.. ఖతార్ హెల్త్ మినిస్ట్రీ కీలక అప్డేట్..!!
- నేబర్ హత్య..వ్యక్తి పై విచారణ..మానసిక పరిస్థితి సరిగ్గా లేదా?
- కువైట్‌లో డ్రైవర్‌ను చంపిన ఓనర్ కు ఉరిశిక్ష..!!
- యూఏఈలో ఏప్రిల్ నెలలో అధిక ఉష్ణోగ్రతలు..!!
- ఈద్ అల్-అధా..కువైట్ లో జూన్ 5-9 వరకు సెలవులు..!!
- మక్కాలో నలుగురు చైనా జాతీయులు అరెస్టు..!!
- తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల..
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు