24 గంటలపాటు అప్రమత్తంగా వుండాలి: ఐఎండీ
- April 24, 2018
న్యూఢిల్లీ: ఆఫ్రికాలో ప్రచండ గాలుల ప్రభావంతో సముద్రంలో అలలు ఉప్పెనలా ఎగసిపడుతున్నాయి. వీటి ప్రభావంతో కేరళ తీరంలో 100 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆఫ్రికా గాలుల కారణంగా సముద్రంలో అలలు భారీగా విరుచుకుపడతాయని ప్రపంచ సునామీ హెచ్చరికల సంస్థ ఇన్ కాయిస్ పేర్కొంది. ఈ అలల ప్రభావం ఎక్కువగా భారత్ లోని తూర్పు, పశ్చిమ తీరాలపై ఉంటుందని ఇన్ కాయిస్ సంస్థ హెచ్చరించింది. సముద్ర తీర ప్రాంతంలో ఉండే వారు అప్రమత్తంగా ఉండాలని ఇన్ కాయిస్ హెచ్చరించింది. ఈ నెల 26వ తేదీ వరకూ ఈ ఆలలు ఎగిసిపడతాయని పేర్కొంది.
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. అండమాన్ తీరం నుంచి భారత్ ప్రధాన భూభాగం వైపు అలలు వస్తున్నాయని, తమిళనాడు, ఏపీ, ఒడిశా, బెంగాల్ తీరాల్లో అలలు అలజడి సృష్టిస్తాయని ఆ సంస్థ పేర్కొంది. పశ్చిమ తీరంలో కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక తీరాల్లోని అలలు అలజడి సృష్టిస్తాయని అంది.
తాజా వార్తలు
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!
- చైనా, మలేషియా బ్యాటరీల పై GCC సుంకాలు..!!
- కొత్త పార్కులు, డిజిటల్ రెసిలెన్స్ పాలసీని ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- సౌదీలో అమీర్.. ద్వైపాక్షిక పెట్టుబడుల వృద్ధిపై సమీక్ష..!!
- బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఒమన్ లో బ్యాలెట్, ఆర్కెస్ట్రా కాన్సర్టుల సీజన్..!!
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…







