భారత్ రావాలనుకుంటున్నాను దయచేసి సాయం చేయండి : పాకిస్థాన్ ఆటగాడి వేదన
- April 24, 2018
పాకిస్థాన్ ప్రముఖ హాకీ ఆటగాడు మన్సూర్ అహ్మద్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత కొంతకాలంనుంచి అయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. చాల రోజుల నుంచి చికిత్స చేయించుకుంటున్నాడు. కానీ ఫలితం లేకపోవడంతో మన్సూర్ కు ఇండియా లేదా క్యాలిఫోర్నియా లో చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అయితే మన్సూర్ మాత్రం భారత్ నే ఎంచున్నాడు. భారత్ లో ఈ వ్యాధికి నివారణకు సక్సెస్ రేట్ ఎక్కువ, పైగా క్యాలిఫోర్నియా వెళ్లాలంటే తన వద్ద ఉన్న డబ్బు సరిపోదనే కారణంతో మన్సూర్ భారత్ పైనే దృష్టి సారించాడు. దయచేసి తనకు వీసా ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోడీని అర్ధిస్తున్నాడు. తనకు అమెరికాలో చికిత్స చేయించుకోవడానికి స్థోమత లేనందువల్ల భారత్ లో అవకాశమివ్వాలని కోరాడు. ఇప్పటికే నా రిపోర్టులను పంపించాను నేను గతంలో ఎన్నోసార్లు భారత ను బాధపెట్టాను. 1989లో ఇందిరా గాంధీ కప్ టోర్నీలో భారత్‌ను పాక్ ఓడించింది. ఇంకా ఎన్నో టోర్నీల్లో మేం గెలిచి మీ బాధకు కారణమయ్యాం. కానీ, ఇప్పుడు నేను గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స కోసం భారత్ రావాలనుకుంటున్నాను. భారత ప్రభుత్వం నుంచి నాకు సాయం కావాలి’ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు మన్సూర్. ఇదిలావుంటే మన్సూర్ అభ్యర్ధనను భారత్ పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







