అమర్‌నాథ్‌ యాత్రకు స్పాట్‌ రిజిస్ట్రేషన్‌

- April 25, 2018 , by Maagulf
అమర్‌నాథ్‌ యాత్రకు స్పాట్‌ రిజిస్ట్రేషన్‌

అమర్‌నాథ్‌ యాత్రికులకు స్పాట్‌ రిజర్వేషన్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది జూన్‌ 28న(జ్వేష్ఠపూర్ణిమనాడు) ఈ యాత్ర ప్రారంభమై ఆగస్టు 26న ముగుస్తుంది. సాధారణంగా ఈ యాత్రకు వెళ్లేవారు అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ చేసుకుంటారు. ఈ ఏడాది నుంచి స్పాట్‌ రిజర్వేషన్‌ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ చేసుకోలేని వారు నేరుగా స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. జమ్ములోని వైష్ణవి ధామ్‌, సరస్వతి ధామ్‌, జమ్మూ హాట్‌, గీతాభవన్‌-రాంమందిర్‌ కేంద్రాల్లో ఈ స్పాట్‌ రిజిస్ట్రేషన్‌కు కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com