తంబాకుని సీజ్ చేసిన కస్టమ్స్
- April 26, 2018
దోహా: జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్స్, పెద్ద మొత్తంలో తంబాకు (నమిలే రకం పొగాకు)ని స్వాధీనం చేసుకున్నారు. ఖతార్లో ఈ తంబాకుపై నిషేధం అమల్లో వుంది. హమాద్ పోర్టులో దీన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 2.8 టన్నుల తంబాకుని వాటర్ హీటర్లలో దాచి తరలిస్తుండగా అధికారులు అత్యంత చాకచక్యంగా దీన్ని పట్టుకోవడం జరిగింది. స్కానింగ్ డివైజ్ ద్వారా చెక్ చేస్తున్న సమయంలో అనుమానాస్పద పదార్థాలు వాటర్ హీటర్లో వున్నట్లు గుర్తించి, వాటిని కస్టమ్స్ అధికారులు వెలికి తీశారు. కస్టమ్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అబ్దుల్హైది అల్ సాహిల్, తమ ఇన్స్పెక్టర్స్ పనితీరుని ఈ సందర్భంగా ప్రశంసించారు. హమాద్ పోర్టులోనే ఈ నెలలో 12 టన్నుల తంబాకుని స్వాధీనం చేసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







