డిజె అవిసి మరణంలో 'నేర' కోణం లేదు: ఆర్‌ఓపి

డిజె అవిసి మరణంలో 'నేర' కోణం లేదు: ఆర్‌ఓపి

మస్కట్‌: స్వీడిష్‌ ఇడిఎం డిజె అవిసిల్‌ మృతి వెనుక నేర పూరిత కోణం లేదని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ స్పష్టం చేసింది. ఒమన్‌లో గత శుక్రవారం డిజె అవిసి హఠాన్మరణం చెందిన సంగతి తెల్సిందే. అవిసి మృతదేహానికి రెండుసార్లు పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించారు. డిజె అవిసి అసలు పేరు టిమ్‌ బెర్‌గ్లింగ్‌. అవిసి మృతి పట్ల సంతాపం తెలియజేసినవారికి, కష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా వుంటామని ప్రకటించినవారికి డిజె అవిసి అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది అవిసి కుటుంబం. ఎలక్ట్రానిక్‌ డాన్స్‌ మ్యూజిక్‌ (ఇడిఎం) సహచరులు, తమ సహచరుడి మృతిని జీర్ణించుకోలేకపోతున్నామంటూ సోషల్‌ మీడియా వేదికగా తమ ఆవేదనను చాటుకుంటున్నారు. స్టాక్‌హామ్‌లో అవిసి జన్మించారు. ఆయన జన్మస్థలంలో వేలాదిమంది ఆయన్ని గుర్తు చేసుకుంటూ పలు కార్యక్రమాల్ని నిర్వహించారు. 

 

Back to Top