మోటార్‌ సైకిల్‌ ఈవెంట్‌: వ్యక్తి దుర్మరణం

మోటార్‌ సైకిల్‌ ఈవెంట్‌: వ్యక్తి దుర్మరణం

మనామా: 57 ఏళ్ళ వ్యక్తి ఒకరు ఓపెన్‌ ట్రాక్‌ మోటార్‌ సైకిల్‌ ఈవెంట్‌ సందర్భంగా ప్రాణాలు కోల్పోయారు. బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం 18.45 నిమిషాల సమయంలో 57 ఏళ్ళ వ్యక్తి ఒకరు, మోటర్‌ సైకిల్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని వెంటనే స్టాండ్‌ బై అంబులెన్స్‌ ద్వారా ఆసుపత్రికి తరలించినా, ప్రాణాలు కాపాడలేకపోయారు. రాత్రి 9.38 నిమిషాల సమయంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆ రోజు జరగాల్సిన ట్రాక్‌ ఈవెంట్స్‌ ఏవీ కొనసాగించలేదు. 

 

Back to Top