'తేజ్ ఐ లవ్ యూ' టీజర్ విడుదల
- April 30, 2018సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో కరుణాకరన్ తెరకెక్కిస్తున్న చిత్రం తేజ్ ఐ లవ్ యూ. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్. రామారావు నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కవితాత్మక భావనలతో సాగే ప్రేమ కథాచిత్రంగా ఈ మూవీ ఉంటుందని తెలుస్తుండగా, ఇందులో సాయిధరమ్ తేజ్ నవతరం ప్రేమికుడిగా కనిపించనున్నాడు. అనుపమ పరమేశ్వరన్ అందంతో పాటు చక్కటి అభినయంతో ఆకట్టుకుంటుంది. కుటుంబ అనుబంధాలు మేళవించిన ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం అందరిని మెప్పిస్తుందని నిర్మాతలు అన్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ మొత్తం పూర్తి కాగా, ప్రస్తుతం పారిస్‌లో పాటల్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం . మేడే సందర్భంగా చిత్ర టీజర్ విడుదల చేశారు. ఇది సినిమాపై అంచనాలు పెంచుతుంది. ఈ నెలలోనే మూవీ రిలీజ్‌కి ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. మరి తాజాగా విడుదలైన టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు