బ్రెజిల్‌లో కూలిన భారీ భవనం
- May 01, 2018
బ్రెసిలియా: బ్రెజిల్‌లో బహుళ అంతస్తుల భవనంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆ కట్టడం కుప్పకూలగా కొందరు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. షావుకోలోని ఓ నగరంలోని ఆకాశహార్మ్యంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే తీవ్రరూపం దాల్చిన మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తుండగా భవనం మొత్తం కుప్పకూలింది. అధికారులు అదనపు సిబ్బందిని మోహరించి సహాయక చర్యలను వేగవంతం చేశారు. ప్రమాదానికి గురైన భవనం ఒకప్పుడు బ్రెజిల్ పోలీసు శాఖ ప్రధాన కార్యాలయం. చాలాకాలంగా ఖాళీగా ఉన్న ఆ భవనంలో కొందరు అక్రమంగా నివాసముంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో ఎంతమంది ఉన్నారు వారి పరిస్థితి ఏమిటన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- లండన్ లో అంగరంగ వైభవంగా శక పురుషుని శత జయంతి వేడుకలు
- ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో ఉద్యోగాలు...
- ICBF ఆధ్వర్యంలో వైభవంగా ‘లేబర్ డే రంగ్ తరంగ్ 2023’
- ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు..కాపాడిన వైద్యుడు..!
- మస్కట్‌లో 49 మంది మహిళా కార్మికులు అరెస్ట్..!
- వ్యభిచార రింగ్ నడిపిన మహిళలకు 10 ఏళ్ల జైలుశిక్ష
- ఈ వేసవిలో ఎయిర్‌పోర్టుల్లో రద్దీ.. నివారణకు 6 మార్గాలు..!
- Dhs1.6b హౌసింగ్ లోన్‌ను ఆమోదించిన షేక్ మహమ్మద్.. 2వేల మందికి లబ్ధి
- హజ్ కోసం 22,000 మంది నియామకం