వేలాదిమంది కార్మికులకు దుబాయ్‌లో కొత్త అకామడేషన్
- May 01, 2018400 మంది దుబాయ్ మునిసిపాలిటీ కార్మికులకు కొత్త అకామడేషన్ ఏర్పాటవుతోంది. ఈ ఏడాదిలోనే అల్ వర్సాన్లో వారికి కొత్త ఇళ్ళను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ వర్కర్స్ డే సందర్భంగా మునిసిపాలిటీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కార్మికుల్ని ఆదుకుంటోన్న ఛారిటీస్, ప్రైవేట్ కంపెనీస్ని సన్మానించారు. గత వారం 138 మంది కార్మికులు మునిసిపాలిటీ ఉమ్రా ప్రార్థనల కోసం పంపింది. అలాగే 8,000 కిట్స్‌ని రమదాన్ ఇఫ్తార్ మీల్స్ సందర్భంగా పంపిణీ చేయనున్నట్లు హామీ ఇచ్చింది. కొత్త లేబర్ అకామడేషన్‌లో అంతర్జాతీయ ప్రమాణాల మేరకు సౌకర్యాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ సిటీ వద్ద అల్ వార్సన్ 2, అల్ వార్సన్ 3 అకామడేషన్స్ వున్నాయి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..