అనుష్క కు బర్త్‌డే కానుకగా..
- May 02, 2018టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి సతీమణి అనుష్క శర్మ బర్త్‌డే నిన్న(మంగళవారం). ఈ సందర్భంగా కోహ్లీ విలువైన బహుమతిని ఇచ్చాడు. వివాహం తర్వాత అనుష్క తొలి బర్త్‌డే కావడంతో.. కోహ్లి ప్రత్యేక కానుక ద్వారా తన ప్రేమను వ్యక్తపరిచాడు. మంగళవారం ఐపీఎల్లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. బెంగళూరు సారధి కోహ్లి ఈ ప్రత్యేక విజయాన్ని తన భార్యకు బర్త్‌డే గిఫ్ట్ ఇస్తున్నట్టు పేర్కొన్నాడు.
మంగళవారం ఉదయం సతీమణి అనుష్కకు ట్విటర్ ద్వారా విషెస్ తెలిపిన కోహ్లి మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ. 'అనుష్క ఇక్కడే ఉంది. ఈ రోజు తన బర్త్‌డే. ఈ విజయం తనకు చిన్న కానుక. ఈ విజయం చాలా ప్రత్యేకమైంది' అని అన్నాడు. దీనిపై అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించి "ఈ ప్రత్యేకమైన బర్త్‌డేను ప్రపంచంలోనే తెలివైన, ప్రియమైన, ధైర్యవంతుడైన వ్యక్తితో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది" అంటూ పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్