దుబాయ్:రమదాన్‌లో స్కూల్‌ టైమింగ్స్‌

- May 02, 2018 , by Maagulf
దుబాయ్:రమదాన్‌లో స్కూల్‌ టైమింగ్స్‌

దుబాయ్:పవిత్ర రమదాన్‌ మాసంలో విద్యార్థుల స్కూల్‌ టైమింగ్స్‌ని మార్చడం ఆనవాయితీగా వస్తోంది. తక్కువ సమయం మాత్రమే స్కూల్స్‌ ఈ సీజన్‌లో నడుస్తాయి. దుబాయ్స్‌ నాలెడ్జ్‌ అండ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కెహెచ్‌డిఎ) ఈ మేరకు సర్కులర్‌ని జారీ చేసింది. ఉదయం 8 నుంచి 8.30 నిమిషాల మధ్య స్కూల్స్‌ & రపారంభమవుతాయి. మధ్యాహ్నం 1 గంట - 1.30 వరకు మాత్రమే స్కూల్స్‌ పనిచేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్‌ టైమింగ్స్‌ 5 గంటలకు మించి వుండకూడదు. కెహెచ్‌డిఎ చీఫ్‌ ఆఫ్‌ రెగ్యులేషన్స్‌ అండ్‌ పిర్మట్స్‌ కమిషన్‌ మొహమ్మద్‌ దార్విష్‌ మాట్లాడుతూ, యూఏఈ మరియు దుబాయ్‌ వాసులకు ఈ పవిత్ర రమదాన్‌ మాసం ఎంతో ప్రత్యేకమైనది చెప్పారు. చిన్నారులు, యువత భవిష్యత్‌ నిర్దేశకులు గనుక, వారికి ఈ పవిత్ర రమదాన్‌ మాసం పట్ల అవగాహన పెంచడం, ఆధ్యాత్మిక వాతావరణాన్ని వారికి అలవాటు చేయడంలో భాగంగా పలు కార్యక్రమాల్ని రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com