నిర్మలా సీతారామన్‌ ను అవమానించిన తమిళులు

నిర్మలా సీతారామన్‌ ను అవమానించిన తమిళులు

కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం తమిళనాడు పర్యటన సందర్భంగా ఆమె కాన్వాయ్‌పై రాళ్ళు, చెప్పుల దాడి జరిగింది. కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటులో కేంద్ర ఆలసత్వానికి నిరసనగా డీఎంకే కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. గ్రామ్‌ స్వరాజ్‌ అభియోన్‌ పథకం అమలును సమీక్షించేందుకు కేంద్రం దత్తత జిల్లాలైన రామ్‌నాథపురం, విరుధునగర్‌ జిల్లాలో ఆమె పర్యటించారు. ఆమె రాక విషయం తెలిసిన డీఎంకే కార్యకర్తలు పార్టీబనూర్‌ జంక్షన్‌ వద్ద కాన్వాయ్‌ను అడ్డగించారు.

Back to Top