అవార్డు రిహార్సల్స్‌లో ఉద్వేగానికి లోనైన బోనీ కపూర్‌

అవార్డు రిహార్సల్స్‌లో ఉద్వేగానికి లోనైన బోనీ కపూర్‌

దివంగత నటి శ్రీదేవికి జాతీయ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును అందుకునేందుకు గురువారం విజ్ఞాన్‌ భవన్‌కు బోనీకపూర్, కుమార్తెలు,జన్వీ,ఖుషీ వచ్చారు. అయితే అవార్డుల ప్రదానోత్సవానికి కంటే ముందు రిహార్సల్స్‌ జరుగుతున్న సమయంలో శ్రీదేవిని గుర్తుచేసుకుంటూ బోనీ కపూర్‌ ఉద్వేగానికి లోనయ్యాడు. మరోపక్క జాన్వి, ఖుషీలు కూడా బాధపడుతున్నట్లుగానే కన్పించారు. శ్రీదేవికి అవార్డు వచ్చినందుకు సంతోషించాలో.. దానిని అందుకోవడానికి ఆమె ఈ లోకంలో లేనందుకు బాధపడాలో అర్థంకావడంలేదని బోనికపూర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

Back to Top