అమెరికాలోని హవాయిలో బద్దలైన అగ్నిపర్వతం
- May 04, 2018
అమెరికా: అమెరికాలోని హవాయిలో బిగ్ ఐలాండ్‌లోని కిలువేయా అగ్నిపర్వతం బద్దలైంది. దాదాపు వంద అడుగుల ఎత్తుకు లావా ఎగసిపడుతోంది. పలు ఇళ్లు దెబ్బతిన్నాయి.మౌంట్ కిలువేయా మంగళవారం నాడు మొదటిసారి బద్దలైంది. అప్పటికే ఆ ప్రాంతంలో నివసిస్తున్న దాదాపు 1,700 మందిని ఖాళీ చేయించి సహాయ శిబిరాలకు తరలించారు. అక్కడ గాలిలో ప్రమాదకర సల్ఫర్ డైఆక్సైడ్ ప్రాణాంతక స్థాయిలో ఉందని.. అక్కడ బాధితులు ఎవరైనా ఉన్నట్లయితే అత్యవసర బృందాలు సాయం చేయటం సాధ్యం కాదని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ పేర్కొంది. ప్రపంచంలో చాలా క్రియాశీలంగా ఉన్న అగ్ని పర్వతాల్లో మౌంట్ కిలువేయా ఒకటి. ఇటీవల వరుసగా భూకంపాలు రావటంతో ఇది గురువారం బద్దలైంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..