దుబాయ్:కారం చల్లి దొంగతనం చేసిన ఇద్దరు దొంగలకు ఏడాది జైలు

- May 05, 2018 , by Maagulf
దుబాయ్:కారం చల్లి దొంగతనం చేసిన ఇద్దరు దొంగలకు ఏడాది జైలు

దుబాయ్:200,000 దిర్హామ్‌లు దోచుకున్న ఇద్దరు దొంగలకు ఏడాది జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. జైలు శిక్ష అనంతరం వీరిని డిపోర్టేషన్‌ చేయనున్నారు. గత ఏడాది జులై 31న కంపెనీ నుంచి బయటకు వెళుతున్న ఓ భారత జాతీయుడ్ని ముగ్గురు వ్యక్తులు అడ్డగించారు. అతని మీద ఓ లిక్విడ్‌ని వారు పోశారు. దాంతో కళ్ళు మంటలతో బాధితుడు తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. ఈ క్రమంలోనే నిందితులు అతని దగ్గరున్న డబ్బుని దోచుకెళ్ళిపోయారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. మొత్తం ముగ్గురు నిందితులు కాగా, అందులో ఒకరు ఇంకా పరారీలోనే వున్నారు. మరో వ్యక్తి వీరికి సహకరించినట్లు పోలీసులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com