నేను..శైలజ...
- December 06, 2015నేను..శైలజ... మా ప్రేమకథరామ్, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం 'నేను... శైలజ'. కిషోర్ తిరుమల దర్శకుడు. స్రవంతి రవికిషోర్ నిర్మాత. శనివారం హైదరాబాద్‌లో రామ్ తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ''ప్రేమకథని కథానాయకుడి కోణంలో చెప్పే ప్రయత్నం చేశాం. ప్రేక్షకులకి తేలిగ్గా అర్థమవుతుందని 'నేను.. శైలజ' అనే పేరు పెట్టాం. ఇందులో పబ్‌లో పనిచేసే డీజేగా నటిస్తున్నా. వాస్తవిక ధోరణిలో సాగుతుంది. ఇలాంటి పాత్ర చేయడం కొంచెం కష్టమే'' అన్నారు. దర్శకుడు చెబుతూ ''నా నిజజీవితంలో జరిగిన ఓ సంఘటనను ఆధారంగా చేసుకుని అల్లిన ప్రేమకథ ఇది. ఈ సినిమా చూస్తూ ఎవరి జీవితాల్ని వాళ్లు తెరపై చూసుకొంటుంటారు. దేవిశ్రీప్రసాద్ మంచి బాణీలను అందించార''న్నారు. నిర్మాత చెబుతూ ''కుటుంబ విలువలు, సహజత్వం ఉట్టిపడుతూ సాగే చక్కని ప్రేమకథ. ఈ నెల 12న పాటల్ని, జనవరి 1న సినిమాని విడుదల చేస్తామ''న్నారు. సత్యరాజ్, నరేష్, ప్రిన్స్, కృష్ణభగవాన్, తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, కూర్పు: శ్రీకర్‌ప్రసాద్, కళ: ఎ.ఎస్.ప్రకాష్. సమర్పణ: కృష్ణ చైతన్య
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్