చెన్నై వరదలలో మృతుల సంఖ్యా 500..
December 06, 2015
చెన్నై వరదల్లో ఇప్పటివరకూ అయిదు వందల మందికి పైగా మృత్యువాత పడ్డారు.. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.. ఈ నేపద్యంలో మృత దేహాలు బయటపడుతున్నాయి.. వరద నీటిలో కొట్టుకు వస్తున్నశవాలను ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది గుర్తించి వాటిని బయటకు తీస్తున్నారు.. కొన్ని చోట్ల ఇళ్లు కూలిన ఘటనలో కూడా మరణాలు సంభవించాయి.. మరికొందరు చలి తీవ్రత వల్ల కూడా మరణించినట్లు భావిస్తున్నారు.. ఈ మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని భయపడుతున్నారు