అమెరికా నుంచి తిరిగొచ్చిన రజనీ...
- May 05, 2018
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల ఆమెరికా వెళ్లి రెగ్యులర్ మెడికల్ చెకప్ చేయించుకున్నారు. యూఎస్ ఎయిర్‌పోర్ట్‌లో క్యాజువల్ డ్రెస్ ధరించి బ్లాక్ సన్ గ్లాసెస్‌తో చాలా స్టైలిష్‌గా కనిపించారు.. వైద్య పరీక్షలు పూర్తి కావడంతో గత రాత్రి ఆయన విమానంలో ఆమెరికా నుంచి చెన్నై ఎయిర్ పోర్టుకి చేరుకున్నారు. అక్కడ అభిమానులు ఆయనకి సాదర స్వాగతం పలికారు. రజనీ సతీమణి ఆయనకి హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించారు. ఇక రజనీ నటించిన కాలా మూవీ ఆడియో వేడుక ఈ నెల 9న జరగనుంది.ఈ కార్యక్రమంలో రజనీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో తన తదుపరి సినిమాని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు రజనీకాంత్.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







