ఎంఐటీ కి సలదారునిగా హీరో అజిత్.!

- May 05, 2018 , by Maagulf
ఎంఐటీ కి సలదారునిగా హీరో అజిత్.!

తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతగొప్ప పేరు సంపాదించిన హీరో అజిత్ కుమార్. తెలుగు వాడైన అజిత్ కుమార్ తెలంగాణాలోని సికింద్రాబాబ్ లో పుట్టి పెరిగాడు. తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన ప్రేమ పుస్తకంతో ప్రారంభించాడు. ప్రముఖ నటి షాలినిని 2000 లో పెళ్ళి చేసుకున్నాడు. ఇతడు చదువుకున్నది పదవ తరగతి వరకు ఐనా బహుభాషాకోవిదుడు.తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, ఆంగ్ల భాషలను అనర్గళముగా మాట్లాడగలడు.

స్టార్ హీరో అజిత్‌కి సినిమాలపైనే కాకుండా బైక్‌, కారు రేస్‌, ఫోటోగ్రఫీపై ఎక్కువ ఇంట్రెస్ట్. కొన్ని రోజులుగా ఆయన చిన్న విమానాలు, హెలికాఫ్టర్స్‌ని తయారుచేస్తున్నారు. రీసెంట్‌గా డ్రోన్‌ల తయారీపై కూడా కాన్సన్‌ట్రేషన్ చేశాడు. ఇటీవల దీనిపై అధ్యయనం చేయడానికి మద్రాస్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)కి వెళ్లి అక్కడి విద్యార్థులతోనూ ముచ్చటించారు.
 
కాగా అజిత్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ వివిధ రంగాల్లో తనదైన ప్రతిభ చూపిస్తున్నారు. కాగా, అజిత్ లోని ప్రతిభని గుర్తించిన ఎంఐటీ ఆయనని 'హెలికాప్టర్‌ టెస్ట్‌ ఫైలట్‌ అండ్‌ యూఏవీ సిస్టం' సలహాదారుడిగా నియమించింది. ఇలాంటి అరుదైన గుర్తింపును తెచ్చుకున్న తొలి నటుడు అజిత్ కావడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com