కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో 'ఇండియా డే'
- May 05, 2018
ఈనెల ఎనిమిదో తేదీ నుంచి 71వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం కానున్నాయి. ఈ విషయం తెలిసింది. అవి ఈనెల 19వ తేదీ వరకూ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భారత్, ఫ్రెంచ్ సినీ పరిశ్రమలు కొన్ని ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావడానికి ఇరుదేశాల దౌత్యకార్యాలయాలు వ్యూహాలు రచించాయి. అందులో భాగంగా ఈనెల 11వ తేదీన కేన్స్‌లో 'ఇండియా డే' పేరిట ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇలా నిర్వహించడం ఇదే మొదటసారి. ఈ విషయాన్ని ఫ్రెంచ్ దౌత్య కార్యాలయం శనివారం వెల్లడించింది. ఒకే తరహా సినీ ప్రాజెక్టులపై రెండు దేశాల భాగస్వామ్యం ఉండేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొంది. 'ఇండియా డే' పేరిట నిర్వహించే ఈ కార్యక్రమంలో మన దేశం తరఫున నందతాదాస్ దర్శకత్వం వహించిన తన బయోపిక్ 'మంటో' ప్రదర్శించబోతున్నారు. ఇందులో జవాజుద్దీనీ సిద్ధిఖీ టైటిల్ రోల్ పోషించారు. దీంతో ధనుష్ హీరోగా రూపొందిన హాలీవుడ్లో డెబ్యూ చిత్రం 'ది ఎక్స్ట్రార్డనరీ జర్నీ ఆఫ్ ది ఫకిర్' చిత్రాన్నీ ప్రదర్శించబోతున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ ఏడాది సోనమ్ కపూర్ భారతదేశం తరఫున పాల్గొననుంది. దీపికా పదుకొనే, ఐశ్వర్యరారు వంటి వారు కూడా రెడ్‌కార్పెట్ మీద హోయలొలికించనున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..