పాక్ బొగ్గు గనుల్లో ప్రమాదం.. 18 మంది దుర్మరణం
- May 05, 2018
పాకిస్థాన్:పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో శనివారం రెండు వేర్వేరు బొగ్గు గనులు కూలిపోయిన దుర్ఘటనల్లో 18 మంది మృతి చెందారు. తొలుత ప్రావిన్స్ రాజధాని క్వెట్టాకు సమీపంలోని మార్వార్ ప్రాంతంలో గ్యాస్ పేలుడు వల్ల బొగ్గు గని కూలిపోవడంతో 16 మంది చనిపోయారని, నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. మరో కార్మికుడు లోపల చిక్కుకున్నట్లు వెల్లడించారు. పాకిస్థాన్ ఖనిజాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న బొగ్గు గనిలో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతి శిథిలాల కింద చిక్కుకున్న ఐదుగురిని కాపాడేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







