మూడు చోట్ల భారీ విస్పోటనాలు..

- May 05, 2018 , by Maagulf
మూడు చోట్ల భారీ విస్పోటనాలు..

సౌర తుపాను భూమిపైకి రాబోతోంది. భగభగ మండుతున్న సూర్యుడి ఉపరితలంపై మూడు చోట్ల భారీ విస్పోటనాలు సంభవించడంతో ఈ స్ట్రోమ్‌ మనవైపుకు వస్తోంది. భారీ విద్యుదావేశంతో కూడిన ఈ సోలార్ స్ట్రోమ్‌.. మరికొన్ని గంటల్లో భూవాతావరణాన్ని చేరుకునే అవకాశం ఉందని నాసా హెచ్చరించింది. దీని ప్రభావం భూ అయస్కాంత క్షేత్రంపై పడి బాహ్య వాతావరణం దెబ్బతింటుందని, ఉపగ్రహ వ్యవస్థకు విఘాతం కలగవచ్చంటూ ప్రకటించింది. ప్రధానంగా జీపీఎస్‌, మొబైల్‌.. శాటిలైట్‌ టీవీ సిగ్నల్స్‌కు కొంతవరకూ అంతరాయం కలగవచ్చు. 

సూర్యుడిపై అసాధారణ అయస్కాంత విస్పోటనం వల్ల ఈ సౌర తుపాను ఏర్పడుతుంది. సూర్యుడి ఉపరితలం చీలి అందులోనుంచి  ప్రమాదకరమైన కాస్మిక్‌ కిరణాలు ఏర్పడడాన్నే సౌర తుఫాను అంటారు.

సౌర తుఫాను. దీనికి మరో పేరు అయస్కాంత తుఫాను. సూర్యుడి ఉపరితలం విచ్ఛేదనమై దాన్నుంచి వెలువడే అయస్కాంత తరంగాలు భూమి అయస్కాంతావరణంపై ప్రభావం చూపి తాత్కాలిక కల్లోలం సంభవిస్తుంది. సౌర తుఫానును శాస్త్రవేత్తలు ఐదు వర్గాలుగా విభజించారు. అవి జీ1, జీ2, జీ3, జీ4, జీ5. జీ1 చిన్నపాటి తుఫాను కాగా, జీ5 భయంకరమైన తుఫాను. జీ5 సంభవిస్తే ఊహించని విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి.

రేపు సూర్యుడు నుండి వచ్చే సౌర తుఫాన్ వల్ల భూ కక్ష్య లో పెనుమార్పులు సంభవిస్తాయని తెలిపింది. భూకక్ష్యలో మార్పులు వల్ల విద్యుత్ వ్యవస్థలో మార్పుల వల్ల ట్రాన్స్ఫార్మర్స్, సబ్ స్టేషన్స్  పేలిపోయే అవకాశం ఉంది.కావున పగటిపూట ఇంటిలో కరెంట్ నిలిపి వేయడం మంచిది .టీవీ లలో నో సిగ్నల్ అని వచ్చే అవకాశం ఉంటుంది.GPS ఆధారంగా నడిచే బ్యాంకింగ్ వ్యవస్థ,విమానాల దిశలో మార్పులు వచ్చే అవకాశం. చారవాని  లో ఇంటర్నెట్ ఉపయోగించే వారు, గేమ్స్ ఆడే వారు జాగ్రత్తగా ఉంటే మంచిదని నాసా వారు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com