ఈ నెల 22న 'టిక్ టిక్ టిక్' విడుదల
- May 05, 2018
చెన్నై: శక్తి సౌందరరాజన్ దర్శకత్వంలో జయంరవి కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'టిక్ టిక్ టిక్'. ఇమాన్ సంగీతం సమకూర్చారు. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతున్న తొలి తమిళ సినిమా ఇది. నేమిచంద్ జబక్ నిర్మాణంలోని ఈ సినిమాకు కార్కి పాటలు రాశారు. ఇప్పటికే ఈ పాటలు ప్రజాధరణ పొందాయి. 'కురుంబా..' అనే పాట ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఈ నెల 22వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు నిర్మాతల మండలి నుంచి కూడా అంగీకారం పొందింది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద స్థాయిలో సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రంలో జయంరవి కుమారుడు ముఖ్య పాత్ర పోషించారు. ఇదిలా ఉండగా గతంలో జయంరవి, దర్శకుడు శక్తి సౌందరరాజన్ కాంబినేషన్లో వచ్చిన 'మిరుదన్' మంచి విజయాన్ని సాధించింది. జోంబీస్ నేపథ్యంలో సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు పంచిపెట్టిందీ జట్టు. ఇప్పుడు అంతరిక్ష పరిశోధన అంశంతో తీసిన చిత్రంతో 22వ తేదీన ప్రేక్షకులకు ముందుకు రావడం విశేషం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..