బడిగాంలో భారీ ఎన్‌కౌంటర్..

- May 06, 2018 , by Maagulf
బడిగాంలో భారీ ఎన్‌కౌంటర్..

జమ్మూ-కశ్మీరులోని షోపియాన్ జిల్లా బడిగాం వద్ద భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పుల కంటే ముందు లొంగిపోవాలని ఉగ్రవాదులకు బలగాలు అప్పీల్ చేశాయి. బలగాల మాటను వినకుండా ఉగ్రవాదులు కాల్పులు జరిపాయి. దీంతో భద్రతా దళాలు కూడా కాల్పులు జరిపి ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఘటనాస్థలిలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.  

జైనపొర ప్రాంతంలోని బడిగామ్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. భద్రతా సిబ్బందిని చూసిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారని తెలిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు దాడి చేసినట్లు చెప్పారు.

సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ శైలేంద్ర మిశ్రా మాట్లాడుతూ తాము ఉగ్రవాదులను లొంగిపోవాలని కోరామని, కానీ ఫలితం లేకపోయిందని చెప్పారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయని, ఎందరు ఉగ్రవాదులు ఉన్నారో చెప్పలేమని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com