హర్రర్ కామెడీ గా "వస్తా" సినిమా
- May 06, 2018
భానుచందర్, జీవా, అదిరే అభి, ఫణి ప్రధాన తారాగణంగా మెట్రో క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న సినిమా `వస్తా`. జంగాల నాగబాబు దర్శకుడు. దమిశెల్లి రవికుమార్, మొహ్మద్ ఖలీల్ నిర్మాతలు. హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - "వస్తా" హర్రర్ కామెడీ చిత్రం. చిన్న చిత్రాలుగా విడుదలై పెద్ద విజయాలను సాధించిన హర్రర్ కామెడీ సినిమాలెన్నో తెలుగులో ఉన్నాయి. వాటి ఇన్స్పిరేషన్తో దర్శకుడి కథ- కథనం నచ్చటంతో వస్తా చేశాము. సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ నెలలొనె పాటలను విడుదల చెస్తాము. భానుచందర్‌గారు సహకారం మరువలేనిది. సినిమాలో ఆయన కీలకపాత్రలో మెప్పిస్తారన్నారు.
భానుచందర్, జీవా, జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి, ఫణి, రఘువర్మ, పిల్లా నాగేంద్ర, అబ్దుల్ రజాక్, రేణుక, జ్యోతిర్మయి, పుట్టి నాగేంద్ర, సొంఠి సుబ్రహ్మణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: బాబ్జీ, కొరియోగ్రఫీ: చందురామ్
పాటలుః ఆనంత్ శ్రీరామ్, సినిమాటోగ్రఫీః వాసి రెడ్డి సత్యానంద్,సహాయ నిర్మాత:రేలంగి కనకరాజు,
నిర్మాతలుః దమిశెల్లి రవికుమార్, మొహ్మద్ ఖలీల్, దర్శకత్వంః జంగాల నాగబాబు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..