హర్రర్ కామెడీ గా "వస్తా" సినిమా

- May 06, 2018 , by Maagulf
హర్రర్ కామెడీ గా

భానుచందర్‌, జీవా, అదిరే అభి, ఫణి ప్రధాన తారాగణంగా మెట్రో క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న సినిమా `వస్తా`. జంగాల నాగబాబు దర్శకుడు. దమిశెల్లి రవికుమార్, మొహ్మద్ ఖలీల్ నిర్మాతలు. హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - "వస్తా" హర్రర్ కామెడీ చిత్రం. చిన్న చిత్రాలుగా విడుదలై పెద్ద విజయాలను సాధించిన హర్రర్ కామెడీ సినిమాలెన్నో తెలుగులో ఉన్నాయి. వాటి ఇన్‌స్పిరేషన్‌తో దర్శకుడి కథ- కథనం నచ్చటంతో వస్తా చేశాము. సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ నెలలొనె పాటలను విడుదల చెస్తాము. భానుచందర్‌గారు సహకారం మరువలేనిది. సినిమాలో ఆయన కీలకపాత్రలో మెప్పిస్తారన్నారు. 
భానుచందర్‌, జీవా, జబర్‌దస్త్ ఫేమ్ అదిరే అభి, ఫణి, రఘువర్మ, పిల్లా నాగేంద్ర, అబ్దుల్ రజాక్‌, రేణుక, జ్యోతిర్మయి, పుట్టి నాగేంద్ర, సొంఠి సుబ్రహ్మణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: బాబ్జీ, కొరియోగ్రఫీ: చందురామ్
పాటలుః ఆనంత్ శ్రీరామ్‌, సినిమాటోగ్రఫీః వాసి రెడ్డి సత్యానంద్‌,సహాయ నిర్మాత:రేలంగి కనకరాజు,
నిర్మాతలుః దమిశెల్లి రవికుమార్, మొహ్మద్ ఖలీల్, దర్శకత్వంః జంగాల నాగబాబు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com