సంచలనం : శ్మశానంలో సాహసం..
- May 06, 2018
అత్యంత పురాతన స్మశానంలో సాహసయాత్ర చేశాడో వ్యక్తి. కానీ అనూహ్యంగా దెయ్యం లేచి పరుగెత్తడంతో ప్రాణభయంతో పరుగులు తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంగ్లండ్ కు చెందిన ఫెర్గూసన్ అనే వ్యక్తి హాంట్స్ అనే ప్రాంతంలోని సెయింట్ మెరీ చర్చి వద్దకు వెళ్ళాడు. చర్చి పక్కన 800 ఏళ్ల నాటి పురాతన స్మశానం ఉంది. గత కొద్ది రోజుల నుంచి అక్కడో ఏదో ఏదోజరుగుతుందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. వీటి గురించి తెలుసుకోవడానికి అర్ధరాత్రి సమయాన స్మశానంలోకి వెళ్ళాడు ఫెర్గూసన్. పరిసర ప్రాంతాలను తన కెమరాతో చిత్రీకరిస్తున్నాడు. ఇంతలో ఒక దెయ్యం ఒక్కసారిగా లేచి పరుగెత్తసాగింది.దీంతో నిర్గాంతపోయిన ఫెర్గూసన్ ప్రాణభయంతో పరుగులు తీశాడు. ఈ వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది కాస్త వైరల్ గా మారింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







