ఆఫ్ఘనిస్తాన్ లో ఏడుగురు భారతీయుల అపహరణ
- May 06, 2018
కాబూల్:ఆఫ్ఘనిస్తాన్లో ఏడుగురు భారతీయులు అపహరణకు గురయ్యారు. ఉత్తర బగ్లాన్ ప్రావిన్స్‌లో ఓ పవర్ ప్లాంట్‌లో వీరంతా పనిచేస్తున్నారు. వీరితోపాటు ఓ అఫ్గాన్ జాతీయుడిని కుడా దుండగులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.
పవర్‌ప్లాంట్‌కు ఇంజినీర్లు మినీ బస్సులో వెళ్తుండగా దుండగులు తుపాకులు చూపించి అడ్డుకున్నారని.. అఫ్గాన్ జాతీయుడైన వాహనం డ్రైవర్‌తోపాటు ఏడుగురు ఇంజినీర్లను అపహరించారని బగ్లాన్ పోలీసులు తెలిపారు. కాబుల్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పవర్‌ప్లాంట్‌లో వీరంతా పనిచేస్తున్నారని పేర్కొంది.
భారత ఇంజినీర్లను విడిపించేందుకు చర్యలు ప్రారంభించినట్లు భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనంటూ ఇంతవరకూ ఏ సంస్థ ప్రకటించుకోలేదని చెప్పారు. ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లో దాదాపు 150 మంది భారత ఇంజినీర్లు, నిపుణులు పనిచేస్తున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..