చైనాలో భారీ వంతెన నిర్మాణం
- May 06, 2018
బీజింగ్ : చైనాలో భారీ వంతెన నిర్మాణం పూర్తయింది. చైనా నిర్మించిన హాంకాంగ్-జుహై మకౌ బ్రిడ్జీ పొడవు 34 మైళ్లు (దాదాపు 55 కిలోమీటర్లు). ఇది ప్రపంచంలోనే అతిపొడవైన ఆనకట్ట. పెరల్ రివర్ డెల్టా ప్రాంతంలో దీన్ని నిర్మించారు. ఈ బ్రిడ్జీ నిర్మాణం కోసం 20 బిలియన్ డాలర్లు ( రూ.1,33,641 కోట్లు) ఖర్చయింది. బలమైన ఈదురుగాలులు, ప్రకృతి విపత్తులను తట్టుకునే సామర్థ్యం ఈ వంతెనలో ఉందని అసిస్టెండ్ డైరెక్టర్, సీనియర్ ఇంజినీర్ గువా జింగ్లిన్ తెలిపారు. హాంకాంగ్, మకావు నగరాలను చైనాలోని మెయిన్‌ల్యాండ్ వంతెన కలుపుతుందని అన్నారు. ఈ మూడు ప్రాంతాలకు ప్రయాణించేందుకు గతంలో మూడు గంటల సమయం పట్టేదన్నారు. అయితే, ఈ వంతెనపై ప్రయాణిస్తే కేవలం అరగంటలోపే గమ్యాన్ని చేరుకోవచ్చుని అన్నారు. చైనా నిర్మించిన కట్టడాల్లో ఇది చరిత్రాత్మకంగా మిగిలిపోతుందన్నారు. ఈ ఆనకట్టను వీక్షించేందుకు పర్యాటకుల తాకిడి బాగా పెరిగే అంచనాలున్నాయని జింగ్లిన్ అన్నారు.
ఈ వంతెనపై ప్రతీరోజు 40వేల వాహనాలు ప్రయాణించే అవకాశముందని చైనా రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. వంతెనపై గరిష్ట వేగం 100కిలోమీటర్లు ఉండేలా నిబంధనలు విధిస్తామని అన్నారు. ఈ బ్రిడ్జీ ప్రారంభమైన తర్వాత చైనా వాణిజ్య రంగం మరింత అభివృద్ధి చెందుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..