టీడీపీ నేత చమన్ మృతి...

- May 07, 2018 , by Maagulf
టీడీపీ నేత చమన్ మృతి...

అనంతపురం జెడ్పీ మాజీ చైర్మన్‌ చమన్‌ మృతి చెందారు.  గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన ఆకస్మికంగా కన్ను మూశారు. పరిటాల రవి  అనుచరుడుగా ఫేమస్ అయిన చమన్‌.. ఆయన మృతి తర్వాత చాలా కాలం అజ్ఞాతంలో గడిపారు. రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత టీడీపీలో కీలకంగా పనిచేస్తున్నారు.

పరిటాల రవికి ప్రాణ స్నేహితుడు,  ప్రధాన అనుచరుడైన 58 ఏళ్ల చమన్‌ మరణ వార్తను టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పరిటాల రవీంద్ర కుమార్తె పరిటాల స్నేహలత వివాహ వేడుక కోసం పర్యవేక్షణ కోసం మూడు రోజులుగా వెంకటాపురంలోనే ఉన్న చమన్‌కు ఇవాళ  ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. మంత్రి పరిటాల సునీత వెంటనే చమన్‌ను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ చమన్ మృతి చెందారు.

 పరిటాల రవికి అత్యంత సన్నిహితుడైన చమన్‌ 2014 నుంచి 2017 మే వరకు అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేశారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి ఫ్యాక్షన్ హత్యల కారణంగా చమన్ దాదాపు ఎనిమిది సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నారు. 2012 సంవత్సరంలో అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం.. పరిటాల సునీత మంత్రి అవ్వడంతో.. తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగిరి మండలం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున చమన్ జడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరాల తరువాత తన పదవికీ రాజీనామా చేశారు.

పరిటాలకు చమన్‌ అత్యంత నమ్మకస్తుడిగా వ్యవహరించడంతో.. సొంత మనిషిలా చూసుకునేవారు రవి. చమన్‌ చికిత్స పొందుతున్నప్పుడు ఆసుపత్రిలోనే ఉన్న మంత్రి పరిటాల సునీత.. ఆయన మృత దేహాన్ని చూసి సొమ్మసిల్లి పడిపోయారు. చమన్‌ను సొంత తమ్ముడిగా సునీత భావిస్తారు.. అందుకే ఆయన మరణ వార్త విని ఆమె షాక్‌ తిన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com