కిండర్‌గార్టెన్‌లో అగ్ని ప్రమాదం: 176 మంది చిన్నారులు క్షేమం
- May 07, 2018
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ పైటర్స్ అత్యంత చాకచక్యంగా అగ్ని ప్రమాదం నుంచి 176 మంది చిన్నారుల్ని రక్షించారు. అల్ వురూద్ కిండర్‌గార్టెన్‌లో అగ్ని ప్రమాదం సంభవించిందన్న సమాచారం అందుకోగానే, సివిల్ డిఫెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. దహాన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో 20 మంది టీచర్లు, 176 మంది విద్యార్థులు ఆ కిండర్‌గార్టెన్‌లో వున్నారని సివిల్ డిఫెన్స్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ అలి అల్ మహబూబి చెప్పారు. నీటిని అలాగే ఫోమ్‌ని ఉపయోగించి మంటల్ని ఆర్పివేసినట్లు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యార్థులంతా క్షేమమని అధికారికంగా ప్రకటించింది.
తాజా వార్తలు
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!







