హాషిష్‌తో పట్టుబడ్డ వ్యక్తికి జైలు
- May 07, 2018
పాకిస్తానీ వ్యక్తి తనతోపాటు నిషేధిత హాషిష్‌ని తీసుకొచ్చిన నేరానికిగాను న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధించింది. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో నిందితుడ్ని హాషిష్‌తో సహా పట్టుకున్నారు అధికారులు. అయితే న్యాయస్థానంలో నిందితుడు, అది తనకు తెలియకుండా జరిగిందంటూ వివరించే ప్రయత్నం చేశాడు. తన తల్లికి యూఏఈ చట్టాల గురించి తెలియదనీ, ఆ కారణంగానే ఆమె తన లగేజ్‌లో హాషిష్‌ని పెట్టిందనీ చెప్పాడు. పాకిస్తాన్లో వున్నప్పుడు తాను డ్రగ్స్ సేవించేవాడిననీ, యూఏఈలో మాత్రం తాను ఎప్పుడూ డ్రగ్స్ సేవించలేదనీ న్యాయస్థానానికి తెలిపాడు నిందితుడు. తన స్వగ్రామంలో డ్రగ్స్ సేవించడం సాధారణమేనని చెప్పిన నిందితుడు, యూఏఈలో మాత్రం ఇక్కడి చట్టాల ప్రకారం నడుచుకుంటున్నట్లు వివరించాడు. అయితే, నిందితుడి వాదనల్ని కొట్టి పారేసిన న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష ఖరారు చేసింది. జైలు శిక్ష తర్వాత నిందితుడు స్వదేశానికి డిపోర్ట్ చేయబడ్తాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..