భయం గుప్పిట్లో వాయువ్య భారతం..
- May 08, 2018
ఢిల్లీ:వాయువ్య భారతం వణుకుతోంది.. ధూళి తుఫాను హెచ్చరికతో భయం గుప్పిట్లో గడుపుతోంది. ఈదురు గాలులు, పిడుగులతో కూడిన ఇసుక తుఫాను అల్లకల్లోలం సృష్టిస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిచింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, దుమ్ము తుఫాను సంభవిస్తాయని ముందస్తు హెచ్చరికలు చేసింది. దీంతో ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని దుమ్ము తుఫాను కమ్మేసింది. గంటకు 70 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. విపరీతమైన దుమ్ము, ధూళి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి.
ఢిల్లీకి సమీపంలోని గురుగావ్, నోయిడా, రోహ్‌తక్, భివానీ, మీరట్, ఘజియాబాద్‌లలోనూ భారీ దుమ్ముతుపాను భయపెట్టింది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. చాలాచోట్ల రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరో 24 గంటల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది..
ఈ గాలి, దుమ్ము తుఫాను రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ, రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్‌పై ఇప్పటికే ఇసుక తుఫాను విరుచుకుపడింది. గత వారం ఉత్తర భారతదేశంలో గాలివాన బీభత్సానికి ఐదు రాష్ట్రాల్లో 124 మంది మృతిచెందగా, 300 మంది గాయపడ్డారు. త్రిపురలో భారీ వర్షాలకు వెయ్యి ఇళ్లు ధ్వంసమయ్యాయి. జమ్ముకశ్మీర్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, కేరళ, సిక్కిం రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీని భారీ గాలి దుమారం వణికించింది. రాత్రి 11 గంటల సమయంలో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి. ఆ తీవ్రతకు ఢిల్లీలోని పలు ప్రాంతాలతో పాటు, గురుగామ్, నోయిడాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఢిల్లీ ప్రభుత్వం ఇవాళ అన్ని సాయంత్రపు స్కూళ్లకు సెలవు ప్రకటించింది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ ఆరుబయట ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని హెచ్చరించింది.
మరోవైపు ఉత్తర భారతదేశంలోనూ ఇవాళ్టి నుంచి శుక్రవారం వరకూ తుపానులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. రాజస్తాన్‌లో ఇసుక తుపాను, ఆరు రాష్ట్రాల్లో గాలి దుమారంతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







