'మహానటి' మూవీ ఓవర్సీస్ రెస్పాన్స్..

- May 09, 2018 , by Maagulf
'మహానటి' మూవీ ఓవర్సీస్ రెస్పాన్స్..

మహానటి-తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య నటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన మహానటి, ఇవాళ గ్రాండ్ గా రిలీజైంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఈ చిత్రం రూపొందినప్పటికీ, రెండు రోజుల తర్వాత 11న ఈ చిత్రం తమిళ్ వెర్షన్ విడుదలవుతుంది. సావిత్రి మీద అభిమానం, ఇష్టం కారణంగా ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఓవర్సీస్ లో నిన్ననే ప్రీమియర్ షోలు వేసేశారు. మరి మహానటి ఎలా మెప్పిస్తుందో చూద్దాం.

వాయిస్-సావిత్రి...ఇప్పటి జనరేషన్ ని పక్కనపెడితే ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు లేడమో. అంతలా మనల్ని తన నటనతో, వ్యక్తిత్వంతో మెప్పించిన హీరోయిన్ సావిత్రి. ప్రేక్షకులు ఆమెను మహానటి అని పిలుచుకుంటారు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి అలరించిన సావిత్రి జీవితం, ఎంతో మందికి ఇన్ స్పిరేషన్.

ఒక సూపర్ స్టార్ గా ఎదిగిన సావిత్రి జీవితం, చివరిదశలో మాత్రం ఎవ్వరూ ఊహించనివిధంగా సాగింది. మద్యానికి అలవాటు పడి, తక్కువ వయసులోనే మనల్ని వదలి వెళ్ళిపోయింది. అందుకే సావిత్రిని తలచుకోగానే మనకు సంతోషంతో పాటు, కాస్త దుఖం కూడా కలుగుతుంది. అలాంటి సావిత్రి కథతో, మహానటి పేరుతో ఓ సినిమా తెరకెక్కి, ఇవాళే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మహానటి పేరుతో సావిత్రి జీవిత కథని సినిమాగా తీశాడు యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ చిత్రానికి నిర్మాత అశ్వనీదత్ కూతుళ్ళు. సావిత్రి చినప్పటి నుంచే మొదలై, సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, స్టార్ గా మారడం, ప్రేమ, పెళ్ళితో పాటు తక్కువ వయసులోనే చనిపోవడం వరకు ఈ సినిమాలో చూపించారు మేకర్స్.

మహానటి మూవీలో టైటిల్ రోల్ ని కీర్తి సురేష్ పోషించింది. తన లుక్ తో సావిత్రి పాత్రలో చక్కగా సెట్ అయ్యింది కీర్తి. ఇక జెమినీ గణష్ పాత్రలో దుల్కర్ సాల్మన్ నటించారు. వీరితో పాటు సావిత్రి జీవతంలో ఉన్న ప్రధాన పాత్రలన్నీ ఇందులో గెస్ట్ అప్పియరెన్స్ గా చూపించారు. ఎఎన్ఆర్ గా నాగచైతన్య, ఎస్.వి.ఆర్ గా మోహన్ బాబు నటించారు. వీరితో పాటు విజయ్ దేవరకొండ, సమంత కీలక పాత్రలు పోషించారు. 

మహానటి సావిత్రి జీవిత కథ కాబట్టి, దక్షిణాది ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేశారు. ఆ తర్వాత ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్ చూశాక సినిమాపై అందరికీ ఇంట్రెస్ట్ పెరిగింది. అంచనాలు పెరిగాయి. ఇవాళ తెలుగు వెర్షన్ రిలీజ్ అవ్వగా, ఈ నెల 11న తమిళ్ వెర్షన్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఓవర్సీస్ లో నిన్న వేసిన ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చూసినవాళ్ళంతా మహానటి సినిమా ఒక ఎమోషనల్ జర్నీ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇక లోకల్ గానూ ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు సావిత్రిని మరోసారి గుర్తు చేసుకుంటూ హాపీగా ఫీలవుతున్నారు...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com