ఇరాన్‌, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు

- May 10, 2018 , by Maagulf
ఇరాన్‌, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ స్థావరాలపై ఇరాన్ దాడికి ప్రతిగా సిరియాలోని ఇరాన్ స్థావరాలన్నింటిపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అవిడోర్ లీబర్‌మాన్ వెల్లడించారు. ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ నిర్వహించిన అతిపెద్ద దాడి ఇది. ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న గోలాన్ హైట్స్‌పై బుధవారం అర్ధరాత్రి వేళ సిరియా భూభాగం నుంచి ఇరాన్ 20 రాకెట్లను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ చెప్పింది. ఇది ఇరాన్‌కు చెందిన అల్‌కుద్స్ బలగాల పనేనని, ఈ దాడుల్లో తమ పౌరులెవరూ గాయపడలేదని వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com